జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదు - రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా : కేసీఆర్ CM KCR Speech at Nizamabad Praja Ashirvada Sabha :గడిచిన పదేళ్లుగా రాష్ట్రంలో ఒక్కసారి కూడా మతకల్లోలాలు జరగలేదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రికేసీఆర్(CM KCR) అన్నారు. అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలకులు ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేదని ఆరోపంచారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛను ఇవ్వట్లేదని పేర్కొన్నారు. బీడీ కార్మికుల కష్టాలు స్వయంగా చూశానన్నారు. తన చిన్నతనంలో బీడీ కార్మికుల ఇళ్లల్లో పెరిగినట్లు సీఎం చెప్పారు. బీడీ కార్మికులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు.
CM KCR Public Meeting in Nizamabad :కాంగ్రెస్ రైతుబంధు తీసేస్తామని అంటోందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు 24 గంటల కరెంట్ వృథా అని కాంగ్రెస్ అంటోందన్న ఆయన.. రైతులకు 3 గంటల కరెంటే ఇస్తామని ఆ పార్టీ చెపుతుందని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ముమ్మాటికీ లౌకికవాద పార్టీయేనని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం పదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నామని వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని తెలిపారు.
ఉచిత కరెంట్‌పై జానారెడ్డి మాట తప్పారు - హాలియా సభలో కేసీఆర్
'గడిచిన పదేళ్లుగా రాష్ట్రంలో ఒక్కసారి కూడా మతకల్లోలాలు జరగలేదు. అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నాం. మైనార్టీల సంక్షేమం కోసం పదేళ్లలో 12 వేల కోట్లు ఖర్చు చేశాం. హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరికి సంక్షేమం అందిస్తున్నాం. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. బీజేపీ మతపిచ్చి లేపి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. మోదీ సర్కార్ 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదు. మెడికల్ కాలేజీ, నవోదయ విద్యాలయం ఒక్కటి కూడా ఇవ్వని బీజేపీకు ఓటు ఎందుకు వేయాలి. జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.' -కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి
CM KCR Comments on BJP :బీజేపీ మతపిచ్చి లేపి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని కేసీఆర్ఆరోపించారు. మోదీ సర్కార్ 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే.. ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీ, నవోదయ విద్యాలయం ఒక్కటి కూడా ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని తెలిపారు. ఈసారి కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని.. అందులో బీఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి - రైతులు అరేబియా సముద్రంలోకి : సీఎం కేసీఆర్
త్వరలోనే ఇబ్రహీంపట్నానికి ఫాక్స్‌కాన్ కంపెనీ : కేసీఆర్