CM KCR Public Meeting in Balkonda Today :ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు ప్రైవేటుపరం చేసిన మోదీ.. సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ఒత్తిడి చేస్తున్నారని.. చచ్చినా... రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని కేంద్రానికి తేల్చి చెప్పానని స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వలేదని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. బాల్కొండలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈసీ అనుమతిస్తే రైతు రుణమాఫీ ఇప్పుడే ఇస్తాం : కేసీఆర్
"నష్టం వచ్చినా.. వరి, జొన్న వంటి పంటలు కొంటున్నాం. ధాన్యం అమ్మిన వారంలోనే రైతులకు డబ్బులు ఖాతాల్లో వేస్తున్నాం. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా పెరగటం లేదు. ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారు. ఏమరుపాటుగా ఓటు వేస్తే.. మన భవిష్యత్ ఆగం అవుతుంది. ఒక్క అవకాశం ఇవ్వమని ఇవాళ కాంగ్రెస్ అడుగుతోంది. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం కాదు.. 11 అవకాశాలు ఇచ్చారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందో ఆలోచించాలి. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలి. దేశంలో తెలంగాణ మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తోంది. చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ.. తలసరి విద్యుత్ వినియోగంలో ముందుంది."- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల