తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరస్ మరణాలకు సర్కారే పూర్తి బాధ్యత వహించాలి: భట్టివిక్రమార్క - వైరస్ మరణాలపై సర్కారే పూర్తి బాధ్యత వహించాలి: భట్టివిక్రమార్క

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఆయన... కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు.

clp leader Mallu Bhatti Vikrama visit nizamabad govt hospital
వైరస్ మరణాలకు సర్కారే పూర్తి బాధ్యత వహించాలి: భట్టివిక్రమార్క

By

Published : Aug 28, 2020, 10:22 PM IST

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. దవాఖానాలోని కరోనా వార్డును పరిశీలించిన ఆయన... వైరస్ బాధితులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్ రోగులకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోందని మండిపడ్డారు. వైరస్ మరణాలపై తెరాస సర్కార్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. వైరస్​తో చనిపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించాలని కోరారు.

ఇదీ చూడండి:పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details