పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టనట్టు ఉండటం దారుణమన్నారు. అన్ని జిల్లాల్లో తిరిగి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పిన భట్టి... వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల గళం వినిపిస్తామని అంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల గళం వినిపిస్తాం' - telangana varthalu
రైతుల సమస్యలపై చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పొలంబాట రైతులతో ముఖాముఖిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. బాల్కొండ మండలం నాగపూర్లో పసుపు పొలాల్లో రైతులతో మాట్లాడారు.
BATTI