నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామానికి చెందిన యువకుడు బుచ్చ శ్రీధర్ మట్టి వినాయకులను తయారు చేస్తూ... భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో వాటిని గ్రామస్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.
మట్టి వినాయకులను తయారు చేస్తూ... మన్ననలు పొందుతూ... - మట్టి గణపతి పూజలు వార్తలు
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను తయారు చేయడమే కాకుండా... గ్రామస్థులకు వాటిని ఉచితంగా పంచుతూ ఓ యువకుడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ప్లాస్టిక్ రహిత మండపాలను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మట్టి వినాయకులను తయారు చేస్తూ... మన్ననలు పొందుతూ
ఈ ప్రతిమల తయారీ కోసం రెండు నెలలుగా సమయం కేటాయించి తయారు చేశాడు. దానికి వాడే సామాగ్రిని సైతం అతనే సమకూర్చుకున్నట్లు తెలిపాడు. మండపం అలంకరణ కోసం కూడా ప్లాస్టిక్ రహిత వస్తువులు ఉపయోగిస్తున్నానని వెల్లడించాడు. ఐదు సంవత్సరాలుగా మట్టి వినాయకుని తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీధర్‌ను గ్రామస్థులు, ప్రతినిధులు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి:సుశాంత్ మృతిపై అధ్యయనానికి డాక్టర్ల బృందం