తెలంగాణ

telangana

ETV Bharat / state

'సాగు చట్టాలతో రైతులకు తీరని నష్టం' - నిజామాబాద్ జిల్లా కేంద్రం తాజా వార్తలు

సాగు చట్టాలను రద్దు చేయాలని నిజామాబాద్​లో సీఐటీయూ డిమాండ్ చేసింది. చట్టాల పత్రాలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపింది. కార్పొరేట్ శక్తులకు కేంద్రం కొమ్ము కాస్తోందని ఆరోపించింది.

CITU burning cultivation law documents in a bogi fire
సాగు చట్టాల పత్రాలను భోగి మంటలో తగులబెడుతున్న సీఐటీయూ

By

Published : Jan 13, 2021, 8:41 PM IST

సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయం వద్ద భోగి మంటల్లో చట్టాల పత్రాలు తగులబెట్టి నిరసన తెలిపారు.

కొమ్ము కాస్తోంది..

చట్టాలు రద్దు చేయాలని దిల్లీలో కోట్లాది మంది రైతులు యాభై రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారని ప్రజా సంఘాల నేత నూర్జహాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు.

పోరాడాలి..

చట్టాలు కార్పొరేట్లకు ఉపయోగపడేలా, రైతుకు నష్టం కలిగే విధంగా తీసుకొచ్చారని ఆరోపించారు. దిల్లీ నుంచి గల్లీ దాకా అన్నదాతలు ఐక్యంగా పోరాడాలని కోరారు.

కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్ధన్, ఈవీఎల్​ నారాయణ, పెద్ది సూరి, శ్రీనివాస్ రాజ్, కటారి రాములు, కృష్ణ, మహేష్, వేణు, మాధవి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రైతుల భవిష్యత్తును సీఎం కేసీఆర్​ తాకట్టు పెట్టారు : భట్టి

ABOUT THE AUTHOR

...view details