తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఆర్సీ ఆధారంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి: గోవర్ధన్

పీఆర్సీ ద్వారా ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను విస్మరించడం సరికాదని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మల్యాల గోవర్ధన్ అన్నారు. పీఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలను కేటగిరీల వారిగా తమకు కూడా అమలు చేయాలని కోరుతూ.. నిజామాబాద్‌ మేయర్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

citu Petition to the Mayor to implement the PRC for municipal workers
జీతాలు పెంచాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్

By

Published : Jun 15, 2021, 4:22 PM IST

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ నిజామాబాద్ నగర కమిటీ డిమాండ్ చేసింది. పీఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలను తమకు కూడా కేటగిరీల వారిగా అమలు చేయాలని కోరుతూ.. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగర మేయర్ నీతూ కిరణ్‌కు వినతీ పత్రాన్ని అందజేశారు.

పీఆర్సీ అమలులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ఔట్‌ సోర్సింగ్ సిబ్బందికి 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన రాష్ట్ర సర్కారు మున్సిపల్ కార్మికులను విస్మరించడం సరికాదని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మల్యాల గోవర్ధన్ అన్నారు. పదకొండవ పీఆర్సీకి అనుగుణంగా జీవో నెంబర్ 60ని సవరించి ప్రకటించిన వేతనాలను జూన్ నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కృష్ణ, మున్సిపల్‌ యూనియన్ నాయకులు మహేష్, సంతోష్ గౌడ్, కిషన్, మారుతి, రాము, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details