నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాసవిక్లబ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మారుతినగర్‌లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కలెక్షన్స్‌లో మానసిక విద్యార్థుల ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలలు దైవ స్వరూపులని.. వారిని సరైన దిశలో పెంచినట్లయితే, వారు భావితరాలకు మార్గదర్శకులు అవుతారని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి పాత సుదర్శన్ వెల్లడించారు.
నిజామాబాద్‌లో ఘనంగా బాలల దినోత్సవాలు - వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు
నేటి బాలలే భావిభారత పౌరులని.. వారిని సరైన రీతిలో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి పాత సుదర్శన్ తెలిపారు. నిజామాబాద్‌లో బాలల దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్‌లో ఘనంగా బాలల దినోత్సవాలు
నేటి బాలలే రేపటి బావిభారత పౌరులని పేర్కొన్నారు. వారికి సరైన విద్యాబుద్ధులు, సమాజం పట్ల అవగాహణను చిన్నతనం నుంచే తల్లిదండ్రులు నేర్పించాలని సూచించారు. దానిలో భాగంగా విద్యార్థులు వేసిన వివిధ వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఈకార్యక్రమంలో వాసవిక్లబ్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు సుదర్శన్ గుప్త, ఇంఛార్జ్ వీరేశం, కార్యదర్శి గంగాధర్, సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'బాలలు పొరపాట్లు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడవాలి'
TAGGED:
childrens day celebrations