నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నల్లూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు 20 డెస్క్ బెంచీలను విరాళంగా అందజేశారు. అనంతరం విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు.
నల్లూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు - Children's Day celebrations in Nallur
నిజామాబాద్ జిల్లా నల్లూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
![నల్లూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5062902-349-5062902-1573731543483.jpg)
నల్లూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ రోజు బాలల దినోత్సవంతో పాటు డయాబెటిస్ డే కూడా కావడం వల్ల పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ గవర్నర్ వీరేశం తెలిపారు.
నల్లూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ