నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన పవన్ కుమార్ తెలంగాణ సోషల్ సర్వీస్ సంస్థ పేరిట డబ్బులు దండుకున్నాడని బాధిత మహిళలు ఠాణాలో ఫిర్యాదు చేశారు. అంబం గ్రామానికి చెందిన గైని లక్ష్మణ్, ఎంబడి ప్రసాద్ సెల్ఫోన్లో తెలంగాణ సోషల్ సర్వీస్ వాట్సాప్ గ్రూపును నిర్వహిస్తూ మహిళల నమ్మిస్తూ డబ్బుల రూపంలో దోచుకున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన మహిళల నుంచి సుమారు రెండు లక్షల 30 వేల రూపాయల దోపిడీకి పాల్పడినట్లు బాధితురాలు, తెరాస నేత శీలం సరస్వతి, నాగమణి వాపోయారు.
డబ్బులు ఇస్తే పదవులిప్పిస్తాం..
ప్రధానంగా పవన్ కుమార్ సోషల్ సర్వీస్ వాట్సాప్ గ్రూప్‌లో వారిని ఉద్దేశిస్తూ తాను తెలంగాణ సోషల్ సర్వీస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడినని.. సర్వీస్‌లో చేరాలంటే ఒక్కో మహిళ సుమారు 3000 నుంచి 4000 రూపాయలు చెల్లిస్తే సంస్థ తరఫున రాష్ట్ర స్థాయిలో మహిళలకు అధ్యక్ష కార్యదర్శి పదవులు.. జిల్లా స్థాయిలో తెరాస కార్యవర్గ పదవులను ఇప్పించేందుకు కృషి చేస్తానని నమ్మబలికాడు.
అబలలకు మాయమాటలు !
దాదాపు 200 మంది మహిళల నుంచి సుమారు రూ. 2 లక్షల 30 వేల రూపాయలు వసూలు చేసి తమను మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 21న మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌కు చెందిన తెరాస నేత సరస్వతి, ఉమా మరికొందరు మహిళలు హైదరాబాద్ నుంచి అంబ గ్రామానికి చేరుకున్నారు.