తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు చిక్కిన చైన్​స్నాచర్లు

చెడు అలవాట్లకు బానిసగా మారిన ఇద్దరు యువకులు చైన్ స్నాచింగ్​కు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి బంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Crime: పోలీసులకు చిక్కిన చైన్​స్నాచర్లు
Crime: పోలీసులకు చిక్కిన చైన్​స్నాచర్లు

By

Published : Jun 6, 2021, 6:25 PM IST

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం దుస్గమ్ గ్రామానికి చెందిన సాయి కుమార్ (21), మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన అరుణ్ (24) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. మద్యానికి బానిసలైన వారు కష్టం లేకుండా డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్​ను నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో దొంగతనం చేశారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను ఎంచుకొని చైన్ స్నాచింగ్​కు పాల్పడుతున్నారు.

నగరంలోని 2, 3, 5వ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్​ స్నాచింగ్​కు పాల్పడ్డారు. వేల్పూరు మండల పరిధిలోని పచ్చలనడుకుడ గ్రామంలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. తర్వాత రెండు సెల్​ఫోన్లు కూడా చోరీ చేశారు. నిందితులు మరో చైన్​ స్నాచింగ్​ పాల్పడుతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్​కు తరలించారు. వారి నుంచి బంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:Software Engineer: కొలువు వదిలేసి.. పొలం బాటపట్టి!

ABOUT THE AUTHOR

...view details