నిజామాబాద్‌లో హైదరాబాద్ తరహా ఎల్ఈడీ లైట్లని ఏర్పాటు చేశామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా చెప్పారు. రాష్ట్రంలో అందమైన నగరంగా నిజామాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వాటర్ ఫౌంటెన్లు, సెంటర్ మీడియం లైట్లు, విశాలమైన రోడ్లని నిర్మించామని తెలిపారు. నగర సుందరీకరణలో భాగంగా సెంటర్ మీడియన్స్కి అమర్చిన స్పైరల్ ఎల్ఈడీ లైట్లను కలెక్టరేట్ గ్రౌండ్ చౌరస్తా వద్ద స్విచ్ ఆన్ చేసి ఆయన ప్రారంభించారు. నగరవాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
'అందమైన నగరంగా నిజామాబాద్‌ని తీర్చిదిద్దుతున్నాం' - నిజామాబాద్ తాజా వార్తలు
నిజామాబాద్‌ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తెలిపారు. రాబోయే కాలంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్‌ను అందంగా ముస్తాబుచేస్తామన్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ... నగరంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఆయన ప్రారంభించారు.
!['అందమైన నగరంగా నిజామాబాద్‌ని తీర్చిదిద్దుతున్నాం' centre lighting inauguration by nizamabad urban mla bigala ganesh gupta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9529876-407-9529876-1605235009394.jpg)
'అందమైన నగరంగా నిజామాబాద్‌ని తీర్చిదిద్దుతున్నాం'
ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, రెడ్కో ఛైర్మన్ అలీం, నుడ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ జితేశ్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఎంపీ అర్వింద్‌పై పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే బాజిరెడ్డి
TAGGED:
nizamabad latest updates