నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో కేంద్ర సెక్రటేరియేట్ సర్వీస్ కార్యాలయం నుంచి వచ్చిన ఎనిమిది మంది బృందం పర్యటించింది. ప్రభుత్వ పథకాల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు సమీక్షించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు సలహాలు ఇచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. జలాల్‌పూర్ వద్ద గల మిషన్ భగీరథ పంప్‌హౌజ్‌ను సందర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో కేంద్ర అధికారుల బృందం పర్యటన - nizamabad
ప్రభుత్వ పథకాల అమలు తీరును నిజామాబాద్ జిల్లాలో కేంద్ర అధికారుల బృందం పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

నిజామాబాద్ జిల్లాలో కేంద్ర అధికారుల బృందం పర్యటన
నిజామాబాద్ జిల్లాలో కేంద్ర అధికారుల బృందం పర్యటన
ఇవీ చూడండి: నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!