తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలుడిని కొట్టిన ఘటనలో పెదనాన్నపై కేసు నమోదు - ఠాణా

నిజామాబాద్ జిల్లాలో బాలుడిని కట్టేసి కొట్టిన ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు బాలుడిని కట్టేసి కొట్టిన పెదనాన్న బాలయ్యపై నవీపేట పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

బాలుడిని కొట్టిన ఘటనలో పెదనాన్నపై కేసు నమోదు
బాలుడిని కొట్టిన ఘటనలో పెదనాన్నపై కేసు నమోదు

By

Published : Aug 13, 2020, 10:28 AM IST

Updated : Aug 13, 2020, 12:27 PM IST

నిజామాబాద్ జిల్లాలో బాలుడిని కట్టేసి కొట్టిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్(ఏ)లో భీమయ్య అనే బాలుడిని అతని పెదనాన్న బాలయ్య తాళ్లతో కట్టేసి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయాన్ని కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

తల్లి ఫిర్యాదు మేరకు...

ఈ నేపథ్యంలో గ్రామానికి వెళ్లిన పోలీసులు విచారణ చేపట్టారు. తల్లి ఫిర్యాదు మేరకు బాలుడిని కట్టేసి కొట్టిన పెదనాన్న బాలయ్యపై నవీపేట పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేశారు. చెప్పిన మాట వినట్లేదని కొట్టినట్లు విచారణలో కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. పనికి రావట్లేదని... బంధువుల అమ్మాయికి వాట్సాప్​లో అసభ్య మెసేజీలు పంపిస్తున్నందుకే కొట్టినట్లు కుల పెద్దల పంచాయతీలో బాలయ్య చెప్పినట్లు సమాచారం.

బాలుడిని కొట్టిన ఘటనలో పెదనాన్నపై కేసు నమోదు

ఇవీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1,931 కరోనా కేసులు నమోదు

Last Updated : Aug 13, 2020, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details