తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా కొనసాగుతోన్న డ్రై రన్ - కలెక్టర్ నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కలెక్టర్‌ నారాయణ రెడ్డి వ్యాక్సినేషన్​ను అందజేశారు.

carona dry run ongoing across Nizamabad district succesfully
నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా కొనసాగుతోన్న డ్రై రన్

By

Published : Jan 8, 2021, 6:36 PM IST

నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్‌ డ్రైరన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు ఆయన డ్రైరన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్​ను అందించారు.

టీకా నిర్వాహణలో ఎదురయ్యే లోపాలను అధిగమించడంతోపాటు సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందుకోసం పకడ్భందీగా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.

సాంకేతికంగా తలెత్తే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్​ తెలిపారు. ప్రభుత్వం అనుమతి రాగానే ప్రతి ఒక్కరికి టీకా అందించేందుకు తాము సన్నద్ధమైనట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:లక్డీకాపూల్​లో సజావుగా సాగుతున్న వ్యాక్సిన్​ డ్రైరన్​

ABOUT THE AUTHOR

...view details