తెలంగాణ

telangana

ETV Bharat / state

గుంతలోకి దూసుకెళ్లిన కారు... ప్రయాణికులు సురక్షితం - car fell into a canal in nizamabad

నిజామాబాద్​ జిల్లా కొనాపూర్​ రాళ్ల వాగు సమీపంలో ఓ కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. నీరు ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

నీటి గుంతలోకి దూసుకెళ్లిన కారు

By

Published : Oct 22, 2019, 1:26 PM IST

Updated : Oct 22, 2019, 2:36 PM IST

నిజామాబాద్​ జిల్లా కమ్మర్​పల్లి మండలం కొనాపూర్​ రాళ్ల వాగు సమీపంలో అదుపుతప్పి ఓ కారు గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. జగిత్యాల జిల్లా రాయికల్​కు చెందిన ఓ కుటుంబం రాళ్లవాగును తిలకించేందుకు వచ్చారు. సందర్శన నుంచి తిరిగి వెళ్తుండగా.. కొనాపూర్​ సమీపంలో అదుపు తప్పి కారు గుంతలోకి దూసుకెళ్లింది. నీటి ప్రవాహం ఎక్కువగా లేకపోవడం వల్ల స్థానికులు వారిని నీటిలోంచి త్వరగా రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును బయటకు తీశారు.

నీటి గుంతలోకి దూసుకెళ్లిన కారు
Last Updated : Oct 22, 2019, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details