తెలంగాణ

telangana

ETV Bharat / state

పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలి

హన్మకొండ 9 నెలల చిన్నారి ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నిజామాబాద్​ జిల్లా బోధన్​లో యువకులు, విద్యార్థులు డిమాండ్​ చేశారు. కొవ్వొత్తులతో చిన్నారికి నివాళులు అర్పించారు.

By

Published : Jun 24, 2019, 7:06 PM IST

నివాళులు అర్పిస్తున్న విద్యార్థులు

హన్మకొండలో 9 నెలల చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ తట్టికోట్ ప్రాంతానికి చెందిన యువకులు, పాఠశాల విద్యార్థులు నిరసన తెలిపారు. అంబేడ్కర్​ చౌరస్తాలో చిన్నారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details