నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ తమ సేవలు ప్రారంభించింది. పలు రూట్లలో బస్సులను నడిపింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు నడుపుతున్నారు. ఎక్స్ప్రెస్లో 33 మంది, ఆర్డినరి బస్సులో 30 మంది మాత్రమే ఎక్కేందుకు అవకాశం ఇస్తున్నారు. మాస్కులు ధరించకపోతే బస్సులోకి ఎక్కనివ్వడం లేదు.
బస్సులు ప్రారంభం.. ప్రజల సంతోషం - నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం
లాక్డౌన్ సడలింపులతో నిజామాబాద్ జిల్లాలో బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ముఖానికి మాస్కులను ధరించి విధులకు హాజరయ్యారు. బస్సుల ప్రారంభం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
![బస్సులు ప్రారంభం.. ప్రజల సంతోషం Buses started in nizamabad people's happiness](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7265561-1089-7265561-1589895550782.jpg)
బస్సులు ప్రారంభం.. ప్రజల సంతోషం
జిల్లాలో లాక్డౌన్కు ముందు పరిస్థితి కనిపించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి. చిరు వ్యాపారులు తమ విక్రయాలు ప్రారంభించారు. అన్ని దుకాణాలు తెరుచుకోవడం వల్ల ప్రజల రద్దీ పెరిగింది.
ఇదీ చూడండి :'కేసీఆర్తో జగన్ భేటీ తర్వాతే ఏపీ జీవో ఇచ్చింది'