నిజామాబాద్ జిల్లా బోధన్ బస్ డిపోలో ప్రమాదం సంభవించింది. గ్యారేజీలో ఆగి ఉన్న బస్సుకు తాత్కాలిక మెకానిక్ వసీం మరమ్మతులు చేస్తున్నాడు. అదే సమయంలో బ్రేకులు ఫెయిల్ అయిన బస్సును గ్యారేజీకి తీసుకువచ్చారు. అదుపుతప్పిన బస్సు వేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న బస్సును వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కింద ఉన్న వసీం గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి క్షతగాత్రున్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆగి ఉన్న బస్సును ఢీకొన్న మరో బస్సు - BUS ACCIDENT IN BODHAN DEPOT
గ్యారేజీలో ఓ బస్సు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇంతలో ఇంకో బస్సు కూడా వస్తోంది. అది కూడా అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న బస్సును ఢీకొంది. బ్రేకులు ఫెయిలవటమే కారణం.
BUS ACCIDENT IN BODHAN DEPOT