MLC Kavitha Bandi Sanjay Chitchat in Nizamabad : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో ఇప్పటికే రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒకరికొకరు సంబంధం లేకుండా బద్ధ శత్రువుల మాదిరి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మద్యం కుంభకోణం వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం చూశాం. మరోవైపు కర్ణాటక ఎన్నికల తర్వాత టీకాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉండగా.. బీజేపీ మాత్రం కొంత నిరుత్సాహంతో ఉంది. అలాగే ఆ పార్టీలో చెలరేగుతున్న అంతర్గత గొడవలు బీజేపీకీ కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.
ఒకేచోట కలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ :ఈ క్రమంలో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత పరస్పరం ఎదురై కాసేపు ముచ్చటించారు. ఇప్పుడు అది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పచ్చగడ్డిపై నీరు పోస్తే భగ్గుమనేలా తరచూ ఆరోపణలు చేసుకునే వారిద్దరు నేడు ఒకేచోట కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బస్వ నర్సయ్య నిజామాబాద్ నగర శివారులో నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమంలో వారిద్దరు తారసపడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జిల్లా జడ్పీ ఛైర్మన్ విఠల్ రావును బండి సంజయ్కు కల్వకుంట్ల కవిత పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత బండి సంజయ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
BJP High Command Serious on TS Leaders : రాష్ట్ర బీజేపీలో కల్లోలం.. ఆ నేతలపై హైకమాండ్ సీరియస్