తెలంగాణ

telangana

ETV Bharat / state

Bomb Squad: నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్​లో బాంబ్ స్క్వాడ్ సోదాలు - Bomb squad searches Nizamabad RTC bus stand

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బాంబ్ స్క్వాడ్ బృందం సోదాలు నిర్వహించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తనిఖీలు చేపట్టినట్లు బృంద సభ్యులు వివరించారు.

Bomb squad
బాంబ్ స్క్వాడ్ సోదాలు

By

Published : Aug 14, 2021, 8:04 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్​లో బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) బృందం తనిఖీలు నిర్వహించింది. రేపు నిర్వహించబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బృంద సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్​తో పాటుగా జిల్లాలో నాలుగు బృందాలతో తనిఖీలు నిర్వహించినట్లు బాంబు స్క్వాడ్ సభ్యులు వెల్లడించారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.

సంబంధిత కథనాలు..

ABOUT THE AUTHOR

...view details