తెలంగాణ

telangana

ETV Bharat / state

Intermediate Exams: హాల్‌టికెట్లపై పరీక్ష కేంద్రం చిరునామా తప్పు... ఆందోళనకు గురైన విద్యార్థులు - hyderabad district news

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు(Intermediate First Year Exams) తొలిరోజు పూర్తయ్యాయి. బోధన్ పట్టణంలోని విద్యార్థుల హాల్‌టికెట్లపై పరీక్ష కేంద్రం చిరునామా... తప్పుగా ముద్రించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. చివరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.

Intermediate Exams
Intermediate Exams

By

Published : Oct 25, 2021, 12:53 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు(Intermediate First Year Exams) తొలిరోజు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యార్థుల హాల్‌టికెట్లపై పరీక్ష కేంద్రం చిరునామా... తప్పుగా ముద్రించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మధుమలంచ జూనియర్ కళాశాల చిరునామా రాకాసిపేట్‌కు బదులు శక్కర్‌నగర్‌గా ముద్రించడంతో విద్యార్థులు అయోమయంకు లోనయ్యారు. శక్కర్‌నగర్‌కు వెళ్లిన విద్యార్థులు చివరి నిమిషంలో రాకాసిపేట్‌లోని పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులు పరీక్ష సమయం దాటిన తరువాత కేంద్రానికి చేరుకున్నప్పుటికీ అధికారులు అనుమతించారు.

రాకాసిపేట్‌కు బదులు శక్కర్‌నగర్‌గా తప్పుపడ్డ చిరునామా

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు...

గతేడాది కొవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల.. ఈసారి కోర్టు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తప్పక ఈ పరీక్షలకు హాజరుకావాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పరీక్షా కేంద్రాలు పెంచినట్లు చెప్పారు.

మొత్తం 1768 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate First Year Exams Started) జరుగుతాయని బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు. ఈసారి 70 శాతం సిలబస్​తో పరీక్ష నిర్వహిస్తున్నందున.. ఆ సిలబస్​కు పరిమితమయ్యే పరీక్ష ఉంటుందన్నారు. ఈ నెల 31 ఆదివారం రోజున సైతం పరీక్ష ఉంటుందని ఈ విషయాలు విద్యార్థులు గమనించాలని కోరారు.ఇంటర్‌ ప్రథమ సంవత్సవరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సోమవారం నుంచి నవంబరు 3వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని గ్రేటర్‌ జోన్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు రూట్‌ పాస్‌ కానీ, విద్యార్థి జనరల్‌ బస్‌పాస్‌ కాని చూపడంతోపాటు హాల్‌టిక్కెట్‌ కూడా తప్పనిసరి చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Covid Vaccine 2nd Dose: 'నిర్లక్ష్యం వద్దు.. ఆలస్యమైనా టీకా తీసుకోవడమే మేలు'

ABOUT THE AUTHOR

...view details