తెలంగాణ

telangana

ETV Bharat / state

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఈరోజు తెలంగాణ, మహారాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తారు.

By

Published : Mar 1, 2020, 5:02 PM IST

Bobli project lifted the gates
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

గోదావరి నదిపై మహారాష్ట్రలో గల వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఈరోజు తెలంగాణ, మహారాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు, బాబ్లీ బంధారా కృతి సమితి సభ్యుల సమక్షంలో గేట్లను ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.31 టీఎంసీలు నీరు ఉండగా.. 0. 6 టీఎంసీల నీళ్లు దిగువకు వదులుతున్నారు.

ప్రాజెక్టులో 0.6 టీఎంసీల నీరు దిగువకు వదలగా 0.71 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని అధికారులు తెలిపారు. 0.6 టీఎంసీల నీరు దిగువనకు వదిలిన అనంతరం 14 గేట్లను మూసివేయనున్నారు.
ఇదీ చదవండి:మారుతున్న తీరు.. రెండో పెళ్లికి సై అంటున్నారు వీరు..

ABOUT THE AUTHOR

...view details