నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బీఎల్టీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గతంలో సుప్రీంకోర్టు, ఇటీవల హైకోర్టు తీర్పుననుసరించి ఔట్ సోర్సింగ్ కార్మిక, ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
'మున్సిపల్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి' - మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలంటూ బీఎల్టీయూ ధర్నా
సుప్రీం, హైకోర్టు తీర్పులననుసరించి మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మిక, ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఎల్టీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

'మున్సిపల్ ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి'
ఆలోపు కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెల్సిందేనని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. తక్షణమే భర్తీలను పూర్తి చేయాలని సిబ్బందిని పెంచాలని తమకు కనీస వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం.రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'