తెలంగాణ

telangana

ETV Bharat / state

సోషల్ మీడియాలో చూశారు.. రక్తదానం చేశారు.. - ఇందూరు బ్లడ్ డోనార్స్ గ్రూప్ వార్తలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందూరు బ్లడ్ డోనార్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కేవలం సోషల్ మీడియాలో చూసి ఈ రోజు పది మంది రక్తదానం చేయడం గొప్ప విషయమని గ్రూప్ ప్రధాన అడ్మిన్ నరాల సుధాకర్ ప్రశంసించారు.

blood donation camp Under the auspices of Indore Blood Donors Group at nizamabad
సోషల్ మీడియాలో చూశారు.. రక్తదానం చేశారు..

By

Published : Mar 22, 2021, 4:20 PM IST

క్లిష్ట పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ముందుకు రావడం ప్రశంసనీయమని ఇందూరు బ్లడ్ డోనార్స్ గ్రూప్ ప్రధాన అడ్మిన్ నరాల సుధాకర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోవడం వల్ల రెడ్​క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కేవలం సోషల్ మీడియాలో చూసి ఈ రోజు పది మంది రక్తదానం చేయడం గొప్ప విషయమని సుధాకర్ అన్నారు.

ఇంకా చాలా మంది ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రక్తదానం చేసి సాటి మనిషి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐడియా సాగర్, రామకృష్ణ, ప్రణీత్, గంగాధర్, పోతన్న, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఎన్నికల్లో అక్రమాలు జరిగాయ్​... సీబీఐతో దర్యాప్తు చేయించండి'

ABOUT THE AUTHOR

...view details