తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన కార్యక్రమం - మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనారాయణ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 50 మంది రక్తదానం చేశారు.

blood-donation-camp-set-up-on-prime-minister-modi-birthday-in-nizamabad
మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన కార్యక్రమం

By

Published : Sep 20, 2020, 5:22 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈనెల 14 నుంచి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 50 మంది రక్తదానం చేశారు.
దేశ సమగ్రతతోపాటు సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరేలా కేంద్రం కృషి చేస్తోందని బస్వా లక్ష్మీనారాయణ అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులకు సరిపడా రక్తం అందుబాటులో ఉండేందుకు రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details