నిజామాబాద్ నగరంలో మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ ఆధ్వర్యంలో 11వ డివిజన్ యువకులు రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి గురించి తెలుసుకున్న నగర మేయర్ స్పందించి 11వ డివిజన్ యువకులను ప్రోత్సహించి రక్తదానం చేయాల్సిందిగా కోరారు. రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు 10 మంది యువకులు రక్తదానం చేశారు.
మేయర్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన యువకులు - nizamabad district news
నిజామాబాద్‌లో మేయర్ దండు నీతు కిరణ్ ఆధ్వర్యంలో యువకులు రక్తదానం చేశారు. మేయర్ కుమార్తె కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మేయర్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన యువకులు
ఇందులో మేయర్ కుమార్తె కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేశారు. ఈ రక్తదానం గురించి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ స్పందిస్తూ మేయర్ స్వయంగా బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి తన కుమార్తెతో రక్త దానం చేయించటం అభినందనీయమని కొనియాడారు. అంతే కాకుండా యువకులతో రక్త దానం చేయించడం చాలా శుభపరిణామమని వెల్లడించారు. రక్తలేమితో బాధపడుతున్న రోగులను ఆదుకోవడానికి నగర ప్రజలు ముందుకు రావాలని కోరారు.
ఇవీ చూడండి: మాజీ మంత్రిని కలిసిన సీఎం కేసీఆర్