బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికి నిజామాబాద్ జీజీహెచ్‌లో శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్‌పేట్‌కు చెందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకగా.. హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నారు. ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడం వల్ల తిరిగి ఇంటికి వెళ్లారు. ఇంకా కొంత ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆదివారం రోజున జీజీహెచ్‌లో చేరారు. అతనికి సోమవారం రోజున శస్త్ర చికిత్స చేసినట్లు వివరించారు.
Black Fungus : నిజామాబాద్‌లో బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికి చికిత్స
బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికి నిజామాబాద్ జీజీహెచ్‌లో శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. మరో నలుగురు బాధితులు ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
నిజామాబాద్‌లో బ్లాక్ ఫంగస్, నిజామాబాద్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు, నిజామాబాద్‌లో బ్లాక్ ఫంగస్ మరణాలు
మరో నలుగురు బ్లాక్ ఫంగస్‌తో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారని డాక్టర్ తెలిపారు. ఆదివారం రోజున బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందిన బాధితురాలి గురించి స్పందిస్తూ.. సరైన సమయంలో ఆమె ఆస్పత్రిలో చేరలేదని.. పరిస్థితి విషమించిన తర్వాత చేరడం వల్ల ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు.