నిజామాబాద్ పట్టణంలో భాజపా ఆందోళన - bjym
ఇంటర్ ఫలితాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని కోరుతూ భాజపా నేతలు నిజామాబాద్ పట్టణంలో ధర్నాకు దిగారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ పట్టణంలో భాజపా ఆందోళన
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డు కార్యదర్శిని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీరందరిని అరెస్టు చేసి ఒకటో పట్ణణ ఠాణాకు తరలించారు. అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నేతలు తెలిపారు.