Minister Harish Rao visit: కామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటనను భాజపా కార్యకర్తలు, బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు. పిట్లంలో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేసి బిచ్కుంద వెళ్తుండగా మార్గంమధ్యలో కొందరు భాజపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకున్న భాజపా కార్యకర్తలు - Pitlam Government Hospital
Minister Harish Rao visit: మంత్రి హరీష్ రావు పర్యటనను కామారెడ్డి జిల్లాలో భాజపా కార్యకర్తలు, బీజేవైఎం నాయకులు రెండు చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేశారు. పిట్లంలో ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం బిచ్కుంద వెళ్తుండగా మార్గమధ్యంలో కొందరు భాజపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన
మరోచోట బిచ్కుందలో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రిని అక్కడ కూడా కొందరు భాజపా కార్యకర్తలు అడ్డుకుని ఆందోళన చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: