వారణాసిలో ప్రధాని మోదీకీ వ్యతిరేకంగా నామినేషన్లు వేసేది... తెరాస తరఫు రైతులని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఇప్పుడు నరేంద్ర మోదీకి పోటీగా బరిలోకి దిగనున్న రైతులంతా ఒక్కసారి కూడా పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృషి చేయలేదని ఆర్మూర్ భాజపా కార్యకర్తల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా వారణాసి వెళ్లి నామినేషన్లు వేస్తే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని మండిపడ్డారు. కూతురుని గెలిపించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... తన స్థాయిని మరిచి మండవ వెంకటేశ్వర్ రావు ఇంటికెళ్లి పార్టీ కండువా కప్పడం ఏంటని ప్రశ్నించారు. తమ పార్టీకి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే తెరాస ఇలాంటి పనులు చేస్తోందని విమర్శించారు. ఎవరెన్ని చేసినా... మరోసారి ప్రధానిగా మోదీయే వస్తారని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
మోదీకి పోటీగా బరిలోకి దిగేది తెరాస తరఫు రైతులే
"మోదీపై నామినేషన్ వేసిన వారంతా పసుపు రైతులు కానే కారు... ఇదంతా తెరాసపై వస్తున్న వ్యతిరేకతలను కప్పిపుచ్చుకునేందుకు గులాబీ దళం చేస్తోన్న పనులే": లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మోదీకి పోటీగా బరిలోకి దిగేది తెరాస తరఫు రైతులే