ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధపు హామీలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని.... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని లూటీ చేసి దిల్లీలో ఎన్ని పొర్లుదండాలు పెట్టినా... జైలుకు వెళ్లక తప్పదన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన భాజపా బహిరంగ సభకు హాజరైన ఆయన... అధికార తెరాసపై విమర్శలు గుప్పించారు. భాజపా పోరాటాల వల్లే ప్రభుత్వం హామీలను అమలు చేస్తోందని తెలిపారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు: బండి సంజయ్ - telangana varthalu
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర పథకాలను పేర్లు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం 2 లక్షల ఇళ్లు ఇచ్చిందని తెలిపారు. ఇళ్ల పథకానికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని... రెండు పడక గదుల ఇళ్ల పేరుతో పేదలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని బండి అన్నారు. రైతు వేదికల్లోనూ కేంద్రం 50 శాతం నిధులు ఇచ్చిందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'కొనుగోలు కేంద్రాలు చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా'