తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్​ఆర్​సీకి మద్దతుగా భారీ జాతీయ జెండాతో ర్యాలీ - ఎన్​ఆర్​సీకి మద్దతుగా బాల్కొండలో భారీ జాతీయ జెండాతో ర్యాలీ

వంద మీటర్ల పొడువు, పది అడుగుల వెడల్పు గల భారీ జాతీయ పతాకంతో ఎన్​ఆర్​సీకి మద్దతుగా బాల్కొండలో భాజపా, ఆర్​ఎస్​ఎస్​ నాయకులు ర్యాలీ నిర్వహించారు.

nrc
ఎన్​ఆర్​సీకి మద్దతుగా భారీ జాతీయ జెండాతో ర్యాలీ

By

Published : Jan 5, 2020, 7:30 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి మద్దతుగా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌... వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఆర్మూర్‌ వీధి నుంచి ర్యాలీ ప్రారంభించి మార్కెట్‌ మీదుగా బస్టాండు సమీపంలో గల అయ్యప్ప మందిరం వరకు కొనసాగించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టానికి మద్దతుగా నినాదాలు చేశారు.

దేశ సంస్కృతి ఎంతో ఉన్నతమైందని ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ ప్రచారక్‌ ఏలేటి రాజారెడ్డి చెప్పారు. పౌరసత్వం చట్టం బిల్లు అమలు వల్ల దేశంలో ఉన్న వారికి ఎలాంటి నష్టం లేదన్నరు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ర్యాలీలో వంద మీటర్ల పొడువు, పది అడుగుల వెడల్పు గల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

ఎన్​ఆర్​సీకి మద్దతుగా భారీ జాతీయ జెండాతో ర్యాలీ

ఇవీ చూడండి: భారీ ధరకు 'దర్బార్​' హక్కులు.. 'తలైవా' డబుల్​ సెంచరీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details