తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి​కి ఘన స్వాగతం - BJP ranks welcomed the BJP national secretary who was on a visit to Bodhan constituency.

బోధన్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన భాజపా జాతీయ కార్యదర్శి​కి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు.

BJP ranks welcomed the BJP national secretary who was on a visit to Bodhan constituency.
పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు

By

Published : Jan 7, 2021, 6:40 PM IST

బోధన్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా.. నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన భాజపా జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్​కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ర్యాలీగా..

ఇందల్వాయి ప్లాజ వద్ద తరుణ్ చుగ్​, బండి సంజయ్​లకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువలతో సత్కరించారు. భారీ కార్ల ర్యాలీ నడుమ ఆయనని జిల్లా కేంద్రానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 3 లక్షల ఆస్తినష్టం

ABOUT THE AUTHOR

...view details