నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యాసంగిలో మొక్కజొన్న పంటకు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మొక్కజొన్న పంటకు అనుమతివ్వాలని భాజపా కిసాన్ మోర్చా ధర్నా - etv bharat
యాసంగిలో మొక్కజొన్న పంటకు వేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. వర్షాలతో వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.

మొక్కజొన్న పంటకు అనుమతివ్వాలని భాజపా కిసాన్ మోర్చా ధర్నా
ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.40 వేల పరిహారం ఇవ్వాలని నియోజకవర్గ ఇన్ ఛార్జి వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం కనీస మద్దతు ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచుతోందని మండిపడ్డారు.
ఇదీ చూడండి:ఈనెల 27 నుంచి వ్యవసాయ డిప్లోమా కౌన్సిలింగ్