తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi sanjay: 'ఒక ఏడాది పాటు అన్నింటిని భరిద్దాం, తెగిద్దాం' - ఎంపీ అర్వింద్​పై దాడి

Bandi sanjay: ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారని.. అయితే దాడులు భాజపాకు కొత్త కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ఇలాంటివాటికి భయపడి పారిపోయే పార్టీ కాదని స్పష్టం చేశారు. తాము కూడా దాడులు చేయడం మొదలుపెడితే బిస్తర్ కట్టాల్సిందేనని హెచ్చరించారు. భాజపా కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని.. సంవత్సరం పాటు అన్నింటిని భరిద్దాం, తెగిద్దామని బండి సంజయ్‌ సూచించారు.

Bandi sanjay on attack on arvind
Bandi sanjay

By

Published : Jan 27, 2022, 7:50 PM IST

Updated : Jan 27, 2022, 8:15 PM IST

Bandi sanjay: తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని.. వారు మార్పు కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ అన్నారు. భాజపాకు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్​లో మంగళవారం ఎంపీ అర్వింద్​పై దాడి ఘటనలో గాయపడ్డ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భాజపా ఎదుగుదల జీర్ణించుకోలేక.. తీవ్రమైన మానసిక ఒత్తిడితో భాజపా ఎంపీలపై దాడులు చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. లోక్​సభ ప్రివిలైజ్‌ కమిటీకి అర్వింద్‌పై దాడి అంశాన్ని తీసుకెళ్తామని సంజయ్‌ స్పష్టం చేశారు. ఈ సంవత్సరమే తెరాస ప్రభుత్వం అధికారంలో ఉంటుందని.. తర్వాత కచ్చితంగా భాజపా ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"నంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి... కేసీఆర్‌. తెలంగాణ కోసం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు ఏం త్యాగాలు చేశారు?. కేసీఆర్‌ దొంగ దీక్ష చేశారు, మమ్మల్ని ఏం చేయలేరు. దాడులు చేసినా ప్రజల కోసం భరిస్తాం. కేసీఆర్‌ రాష్ట్రంలో అధికారంలో ఉంటే..కేంద్రంలో మేం ఉన్నాం. నిరుద్యోగ భృతి, పీఆర్సీ, పంట కొనుగోళ్లు, 317 జీవోపై భాజపా ప్రశ్నిస్తోందని.. దాడులకు పాల్పడటం నీచమైన చర్య. మేం దాడులు చేయడం మొదలుపెడితే బిస్తర్ కట్టాల్సిందే."

- బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Attack On MP Arvind: ఎంపీ అర్వింద్‌పై దాడి చేస్తారని డీజీపీ, సీపీకి తెలుసన్న సంజయ్​.. నిజామాబాద్‌ సీపీ నేతృత్వంలో పోలీసు అధికారులు దాడిచేశారని ఆరోపించారు. సీఎం కార్యాలయం దర్శకత్వంలోనే దాడులు చేయించారన్నారు. ఎంపీపై దాడి జరిగితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. దాడిచేసిన అందరూ బయట తిరుగుతున్నారని సంజయ్​ తెలిపారు. తమపైనే దాడి చేసి తిరిగి తమమీదే కేసులు పెడతారని తెలుసని.. కరీంనగర్​లోనూ ఇదే జరిగిందని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్యేలు, నాయకులను కేసీఆర్ అదుపులో పెట్టుకోవాలని.. భాజపా నేతలను రెచ్చగొట్టొద్దని బండి సంజయ్​ హెచ్చరించారు. ఎంపీ అర్వింద్‌పై దాడి ఘటనపై సీఎం స్పందించి, దాడిని ఖండించాలని బండి సంజయ్ డిమాండ్​ చేశారు. ​ దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీచూడండి:TRS attack on MP Arvind : ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు

ఆయుధాలిచ్చి ఉసిగొల్పారు...

గతేడాది చౌట్​పల్లిలో పసుపు రైతులు పిలిచి భోజనం పెట్టారని ఎంపీ అర్వింద్​ తెలిపారు. తనపై పసుపు రైతులెవరూ దాడి చేయలేదని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం.. కొందరికి తాగించి, తినిపించి, ఆయుధాలిచ్చి తనపై దాడికి ఉసిగొల్పారని ఎంపీ అర్వింద్​ ఆరోపించారు. హైదరాబాద్ నుంచి గుండాలను రప్పించి దాడి చేయించారని అనుమానం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి తనతో ముఖాముఖికి రావాలని అర్వింద్​ సవాల్​ విసిరారు. తనపై జరిగిన హత్యాయత్నంలో నిజామాబాద్​ సీపీకీ హస్తముందన్న అర్వింద్​.. దాడి ఘటనపై కలెక్టర్​ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

భరిద్దాం, తెగిద్దాం..

అంతకుముందు ఆర్మూర్​లో భోజనం చేసిన బండి సంజయ్ ఇతర నేతలు నందిపేట్​కు వస్తూ ఎంపీ అర్వింద్​పై దాడి జరిగిన ఇస్సాపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భాజపా కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని.. సంవత్సరంపాటు అన్నింటికి భరిద్దాం, తెగిద్దామని బండి సంజయ్‌ సూచించారు. ఎంపీలపై దాడులు చేసే రైతులు రాష్ట్రంలో లేరన్నారు. బండి సంజయ్ వెంట ఎంపీలు అర్వింద్, సోయం బాపురావు, ఎమ్మెల్యే రఘునందన్​రావు, భాజపా రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్టీ తమిళనాడు సహా ఇంఛార్జి సుఖేందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్మన్​ తుల ఉమ ఉన్నారు.

Bandi sanjay: 'ఒక ఏడాది పాటు అన్నింటిని భరిద్దాం, తెగిద్దాం'

ఇదీచూడండి:

Last Updated : Jan 27, 2022, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details