నిజామాబాద్ జిల్లా నందిపేటలో భాజపా ఎంపీటీసీ సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. సమయానికి ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించలేదని మండిపడ్డారు. ప్రధాన కూడలి వద్ద బైఠాయించి ఎంపీడీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎస్సై రాఘవేందర్ వచ్చి సర్దిచెప్పడం వల్ల భాజపా సభ్యులు నిరసన విరమించారు.
ప్రమాణ స్వీకారం బహిష్కరించిన భాజపా సభ్యులు - mptc
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల భాజపా ఎంపీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించారు. రోడ్డుపై ధర్నాకు దిగారు.
ధర్నా చేస్తున్న భాజపా ఎంపీటీసీలు