తెలంగాణ

telangana

ETV Bharat / state

'వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ అక్కడ​ ఓడిపోవడం ఖాయం'

MP Dharmapuri Arvind fire on KTR: వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీఆర్​కు సిరిసిల్లలో ఓటమి తప్పదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యానించారు. నిజామాబాద్​లోని తన నివాసంలో మాట్లాడిన ఆయన.. కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇందూరుకు కేటీఆర్‌ ఎందుకు వచ్చారు? నిజామాబాద్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌ చేసిందేమిటి? కాళేశ్వరంలో కమీషన్లు తిన్నారు కాబట్టే డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వట్లేదు. బీజేపీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు’ అంటూ అర్వింద్‌ విమర్శలు గుప్పించారు.

MP Arvind
MP Arvind

By

Published : Jan 30, 2023, 4:34 PM IST

Updated : Jan 30, 2023, 5:05 PM IST

MP Dharmapuri Arvind fire on KTR: నిజామాబాద్​ జిల్లాకు సీఎం కేసీఆర్​, కేటీఆర్​ ఏం చేశారో చెప్పాలని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ప్రశ్నించారు. నిజామాబాద్​లో తన నివాసంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల హామీలు తప్ప ఆచరణలో బీఆర్​ఎస్ ప్రభుత్వం​ చేసింది శూన్యమని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత కల్వకుంట్ల కుంటుంబ సభ్యుల జీవితం బాగుపడిందని.. సామన్య ప్రజల జీవితాలు మరింత దిగజారాయని ఆయన ఆరోపించారు. 'మహిళా గవర్నర్​పై అసభ్య పదజాలంతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు దూషిస్తున్నారు. ఇదేనా బీఆర్​ఎస్​ సంస్కృతి' అని సూటిగా ప్రశ్నించారు. చేనేత జీఎస్టీలో రాష్ట్ర వాటా కట్ చేసి.. ఆ తరువాత జీఎస్టీ గురించి మాట్లాడాలని అర్వింద్​ పేర్కొన్నారు.

అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో పెట్రోల్ , డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటో ప్రభుత్వం చెప్పాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌కు సిరిసిల్లలో ఓటమి తప్పదని ఆరోపించిన ఆయన.. కేటీఆర్‌ ‘"ఇందూరుకు ఎందుకు వచ్చారు? నిజామాబాద్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌ చేసిందేమిటి? కాళేశ్వరంలో కమీషన్లు తిన్నారు కాబట్టే డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వట్లేదని" మండిపడ్డారు.

"ఇళ్ల జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామన్న హామీ గాలికి వదిలేసారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎన్నికల హామీలు తప్ప, ఆచరణలో చేసింది శూన్యం. కాలేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తిన్నారు, కాబట్టే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం లేదు. కాళేశ్వరం డీపీఆర్ ఇస్తే.. జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయం. బీఆర్ఎస్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తే నష్టం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జీవితం బాగుపడింది. సామాన్య ప్రజల జీవితం దిగజారింది. మహిళా గవర్నర్​పై అసభ్య పదజాలంతో ఎమ్మెల్యేలు దూషిస్తున్నారు. ఇదేనా బీఆర్​ఎస్​ సంస్కృతి"..?- ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

'వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ అక్కడ​ ఓడిపోవడం ఖాయం'

ఇవీ చదవండి:

Last Updated : Jan 30, 2023, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details