నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవిపేట్లో భాజపా పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క పనీచేయలేదని విమర్శించారు. చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభం, పసుపు బోర్డు సాధించటంలో సర్కారు విఫలమైందని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిగా గెలిపించాలని అర్వింద్ కోరారు.
'ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు'
నిజామాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. హామీలు ప్రకటించి వాటిని నెరవేర్చటంలో కేసీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు.
నిజామాబాద్ భాజపా అభ్యర్థి ప్రచారం