తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ విషయంలో కేసీఆర్​కు భారతరత్న ఇవ్వొచ్చు : అర్వింద్​ - ఎపీ అర్వింద్ వార్తలు

కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని భాజపా ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. కేంద్రం తెచ్చేది భయంకరమైన బిల్లు కాదని, బ్రహ్మాండమైన బిల్లని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ను అడ్డుకునే అంశాలు బిల్లులో లేవని స్పష్టం చేశారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని బిల్లులో ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

mp arvind
mp arvind

By

Published : Sep 17, 2020, 3:07 PM IST

కేంద్రం తెచ్చేది భయంకరమైన బిల్లు కాదని, బ్రహ్మాండమైన బిల్లు అని భాజపా ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన విద్యుత్‌ వ్యవస్థను సరిచేసేందుకే కొత్త బిల్లు అని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్​కు భారతరత్న ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీల రాయితీ మొత్తం కేంద్రమే కడుతుందని అర్వింద్ తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ఎందుకు సాధ్యం కాదో కేసీఆర్‌ చెప్పాలన్నారు. ఉచిత విద్యుత్‌ను అడ్డుకునే అంశాలు బిల్లులో లేవని స్పష్టం చేశారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని బిల్లులో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. శ్రీశైలంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కొనాలని బిల్లులో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా డిస్కంల ప్రైవేటీకరణ జరగదని చెప్పారు.

ఆ విషయంలో కేసీఆర్​కు భారతరత్న ఇవ్వొచ్చు : అర్వింద్​

ఇదీ చదవండి:భట్టికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు చూపిస్తున్న తలసాని..

ABOUT THE AUTHOR

...view details