తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈటల మాటలకు ఎర్రబెల్లి వివరణ ఇవ్వటం దౌర్భాగ్యం' - mp arvind

ఈటల రాజేందర్ ప్రసంగానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు వివరణ ఇవ్వటం దౌర్భాగ్యమని భాజపా ఎంపీ అర్వింద్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు తెరాసలో గుర్తింపు లేదన్నారు.

mp arvind

By

Published : Sep 1, 2019, 5:41 PM IST

తెలంగాణ ఉద్యమకారులకు తెరాసలో గుర్తింపు లేదని భాజపా ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. అసలైన ఉద్యమకారులు అణిచివేతకు గురయ్యారని ఆరోపించారు. తెరాసలో ఉద్యమకారులు, కార్యకర్తలతో కలిసి పనిచేసేది హరీశ్‌రావు, ఈటల మాత్రమేనని స్పష్టం చేశారు. ఈటల మాటలకు ఎర్రబెల్లి దయాకర్‌రావు వివరణ ఇవ్వటం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని అన్నారు. ఎన్ని వేల టన్నులైనా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ అర్వింద్‌ వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details