నిజామాబాద్ భాజపా కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఫ్లెక్సీలో జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ ఫోటోను పెట్టలేదని కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ ఘటనపై లక్ష్మీనారాయణ స్పందిస్తూ... తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫోటోల గురించి కానీ, వ్యక్తిగత అవసరాల గురించి కానీ పట్టించుకోలేదని, పార్టీ ఎజెండానే తన ఎజెండా అన్నారు. దీంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు.
ఫోటోల కోసం పని చేసే వ్యక్తిని కాదు..
నిజమాబాద్ భాజపా విస్తృతస్థాయి సమావేశంలో ఫ్లెక్సీ గొడవ జరిగింది. యెండల లక్ష్మినారాయణ ఫోటో లేదని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే వ్యక్తిగత అవసరాల గురించి పట్టించుకోనని చెప్పటంతో కార్యకర్తలు శాంతించారు.
కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
ఇవీ చూడండి: భానుడి భగభగలకు తగలబడిన బైక్