తెలంగాణ

telangana

ETV Bharat / state

మక్కలను వెంటనే ప్రభుత్వం కొనుగోలుచేయాలి: భాజపా నేత లక్ష్మీనారాయణ - నిజామాబాద్​లో భాజపా నేతల ప్రెస్​మీట్​

ఉపఎన్నికల కోసమే మంత్రి హరిశ్ రావు భాజపా ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భాజపా జిల్లా నాయకులతో నిజామాబాద్​లో సమావేశం ఏర్పాటు చేశారు.

bjp leaders press meet in nizamabad
మక్కలను వెంటనే ప్రభుత్వం కొనుగోలుచేయాలి: భాజపా నేత లక్ష్మీనారాయణ

By

Published : Sep 30, 2020, 8:21 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని భాజపా కార్యాలయంలో నాయకులతో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. మక్కలకు డిఫరెన్స్ ప్రైస్ ఏదైతే ఉందో.. మార్కెట్ తేడాకు సగం డబ్బు కేంద్రమే అందిస్తుందన్నారు. మార్కెట్లో కౌంటర్లు ఏర్పాటు చేసి మక్కలు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

పండించిన పంటను ఎక్కడ అమ్మాలో తెలియక రైతులు రోడ్లపై పోసుకుని ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు కరవుతీరా ఎరువులు ఇచ్చారన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాకే మక్కలకు రూ. 1100గా ఉన్న రేటు రూ. 1800గా పెంచారన్నారు. 24 గంటల కరెంటు రైతులకు అందించామన్నారు.

ఇదీ చూడండి: వారు మత రాజకీయాలు మానుకుంటే మంచిది: లక్ష్మణ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details