నిజామాబాద్నగరంలో భాజపా కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. దుబ్బాకలో ఆ పార్టీ అభ్యర్థి గెలుపుపై... జిల్లా కార్యాలయం నుంచి నిఖిల్ సాయి చౌరస్తా వరకు ర్యాలీ చేశారు. ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ బాణాసంచా కాల్చి... మిఠాయిలు పంచుకున్నారు.
'దుబ్బాకలో భాజపా గెలుపు భవిష్యత్తుకు పునాది' - తెలంగాణ వార్తలు
దుబ్బాకలో భాజపా విజయం ఇందూరు నేతల్లో ఉత్సాహం నింపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.
'దుబ్బాకలో భాజపా గెలుపు భవిష్యత్తుకు పునాది'
జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ ఆనందంతో నృత్యం చేశారు. అనంతరం మిఠాయిలు తినిపించుకుని... దుబ్బాకలో గెలిపొందిన రఘునందన్రావుకి శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాక విజయం తెలంగాణలో భాజపా బలానికి సంకేతాలని... 2023 ఎన్నికల్లో గెలుపునకు పునాది అని జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు.
ఇదీ చూడండి:కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు