నిజామాబాద్‌లో భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సమృద్ధిగా వర్షం కురిసినా జిల్లాలోని వేలాది ఎకరాల్లో సోయా విత్తనాలు మొలకెత్తకపోవటం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సోయా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సోయా రైతులకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి: భాజపా
నిజామాబాద్ జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసినా... సోయా విత్తనాలు మొలకెత్తకపోవటంపై భాజపా కిసాన్ మోర్చా నాయకులు అధికారులను కలిశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి సోయా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు.
bjp kisan morcha leaders protest for soya farmers in nizamabad
నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎకరానికి రూ. 30 వేల పరిహారం చెల్లించాలన్నారు. మళ్లీ విత్తుకోవటానికి రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు.