నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండల కేంద్రంలో భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా... బాన్సువాడ నియోజకవర్గం నాయకులు మల్యాద్రి రెడ్డి ఆ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం వీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
'భాజపా అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలి' - భాజపా ఆవిర్భావ దినోత్సవం వార్తలు
రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని బాన్సువాడ నియోజకవర్గం నాయకులు మల్యాద్రి రెడ్డి సూచించారు. భారతీయ జనతా పార్టీ దినోత్సవం సందర్భంగా వర్ని మండలంలో ఆ పార్టీ జెండాను ఎగురవేశారు.
'భాజపా అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలి'
వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉంటే మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే ఆస్కారం ఉందని... ప్రజలకు తెలపాలని సూచించారు.
ఇదీ చూడండి:భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం... సాగర్ ఉపఎన్నికలపై చర్చ