తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాతోనే గ్రామాభివృద్ధి సాధ్యం: ధర్మపురి అరవింద్ - BJP Election Compaign in Nizamad district

రాష్ట్రవ్యాప్తంగా ప్రాదేశిక ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున పార్టీ సినియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో భాజపా సినియర్ నేత ధర్మపురి అరవింద్ రోడ్​ను నిర్వహించారు.

భాజపాతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: ధర్మపురి అరవింద్

By

Published : May 1, 2019, 11:41 PM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాజపా సీనియర్ నేత ధర్మపురి అరవింద్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇందల్వాయి, గన్నారం, సిర్నపల్లి, నల్లవెల్లి గ్రామాల్లో రోడ్​ షో లో పాల్గొన్నారు. తెరాస నిరంకుశ వైఖరితోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోగా... కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. గ్రామస్థాయి నుంచి భాజపాను గెలిపిస్తే అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం అని పేర్కొన్నారు.

భాజపాతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: ధర్మపురి అరవింద్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details