భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుని విజయ పథంలో దూసుకెళ్తుందని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య తెలిపారు.
'ఆత్మ నిర్భర భారత్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి' - నిజామాాబాద్లో భాజపా నేత ప్రెస్‌మీట్
ఆత్మ నిర్భర భారత్ అభియాన్‌ను ప్రతిఇంటికీ తీసుకెళ్లాలని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య సూచించారు. కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని చెప్పారు.
'ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి'
వివిధ రకాల పథకాలకు ప్రవేశపెట్టి, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం అవ్వని సమస్యలను తీర్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.