తెలంగాణ

telangana

ETV Bharat / state

సన్నరకం వడ్లకు మద్దతు ధర కల్పించాలని భాజపా ధర్నా - నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కూడలి

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ నిరసనలో సన్న రకం వడ్లకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

BJP dharna demands for support price for Sannarakam Vadlu
సన్నరకం వడ్లకు మద్దతు ధర కల్పించాలని భాజపా ధర్నా

By

Published : Nov 3, 2020, 5:40 PM IST

సన్న రకం వడ్లకు 2,500 రూపాయల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ ధర్నా నిర్వహించింది. కేసీఆర్ నిర్బంధ వ్యవసాయం చేయిస్తూ కేవలం సన్న ధాన్యం వేయాలని.. లేకుంటే రైతు బంధు రాదని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు.

ఇప్పుడు..సన్న రకం వేస్తే పురుగు పట్టి.. రోగం వచ్చి.. దిగుబడి తగ్గి.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడేలా మారిందని ఆవేదన చెందారు. కేంద్రం ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకమే వేయాలని సూచించిన కారణంగా కచ్చితంగా 600 రూపాయల బోనస్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.

ఇవీ చదవండి:సిర్నపల్లిలో ఎకరం వరి పంటకు నిప్పు పెట్టిన రైతు

ABOUT THE AUTHOR

...view details