BJP Chief JP Nadda in Nizamabad Sabha : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ (BJP) నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిజామాబాద్లో బీజేపీ శ్రేణులు నిర్వహించిన సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో మాట్లాడిన ఆయన తెలంగాణలో దళిత క్షేమం కోసం చేపట్టిన దళితబంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రాలో రౌడీలను ఎదుర్కొంటున్నా : పవన్ కల్యాణ్
కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ బీమా ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని వివరించారు.మోదీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత దేశం ఐదో స్థానానికి చేరిందని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పసుపు బోర్డు (Telangana Turmeric Board) ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని దించేది బీజేపీనేనని స్పష్టం చేశారు.
"వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారుతాయి. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ వంచించారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం మాత్రం అభివృద్ధి చెందింది. కేసీఆర్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయమైంది. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం. కుటుంబపాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది." - జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
BJP Chief JP Nadda Fires on BRS Government :బీఆర్ఎస్ అంటే భారత రాక్షసుల సమితి అని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. పేదల భూమిని గుంజుకునే పని ధరణి ద్వారా చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి ద్వారా వస్తున్న ఇబ్బందులను తొలగిస్తామని.. పేదల భూములు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అని విమర్శించారు.